శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (15:56 IST)

నువ్వా.. నేనా తేల్చుకుందామంటున్న బాబాయ్ - అబ్బాయ్

బాబాయ్ అబ్బాయ్‌లు మరోమారు తలపడనున్నారు. 'నువ్వానేనా' అంటూ యుద్ధ రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలుకానుంది.

బాబాయ్ అబ్బాయ్‌లు మరోమారు తలపడనున్నారు. 'నువ్వానేనా' అంటూ యుద్ధ రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ముగింపు దశకి చేరుకోగా.. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
 
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుకున్న సమయానికే ఈ సినిమా షూటింగ్ మొదలై వుంటే, దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు గానీ అలా కుదరడంలేదు. ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. 
 
ఈ రెండు చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచేలా కనిపిస్తున్నాయి. ఎలాగంటే మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అందువల్ల ఆయన ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే, అబ్బాయ్ కూడా తన సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. దాంతో బాబాయ్.. అబ్బాయ్‌ల మధ్య పోటీ తప్పదేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.