శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (11:22 IST)

మరింత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వున్నట్లు వైద్యులు బులిటెన్లో తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన కీలక అవయవాలు పనిచేయడంలేదని ఇదివరకే స్పష్టం చేసారు.

 
ఇదిలావుంటే, కైకాల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు సత్యనారాయణ కోలుకోవాలని అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీ ఆకాంక్షిస్తోంది.