గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (13:07 IST)

వెంటిలేటర్‌పై కైకాల సత్యనారాయణ : ఫోన్ చేసి ఆరా తీసిన చిరంజీవి

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కైకాల కుటుంబ సభ్యులతో పాటు.. ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. 
 
ఇదిలావుంటే, కైకాల ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికపుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు