ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (15:01 IST)

తన భార్య కాజల్ తల్లికాబోతుందంటూ కిచ్లూ ట్వీట్

తన భార్య అయిన సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లికాబోతుందంటూ అమె భర్త గౌతమ్ కిచ్లూ ఆదివారం వెల్లడించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కాగా, కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ జంట గోవాకు వెళ్లింది. అక్కడ దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన కిచ్లూ.. "2022.. నిన్నే చూస్తున్నా" అంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని ఎటాచ్ చేశారు. దీంతో కాజల్ గర్భందాల్చిందనే విషయాన్ని ఆయన రూఢీ చేశారంటూ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన కాజల్ అగర్వాల్.. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త కిచ్లూను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో తాను అంగీకరించిన పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారు. ఇలాంటి శంకర్ దర్శకత్వం వహించే "భారతీయుడు-2" చిత్రం కూడా ఉంది. చిరంజీవి "ఆచార్య" చిత్రంలో మాత్రం ఆమె నటించారు.