Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రానాతో ఓవర్.. ఇక వెంకటేష్‌తో రొమాన్స్‌కు కాజల్ అగర్వాల్ రెడీ..

సోమవారం, 6 నవంబరు 2017 (11:00 IST)

Widgets Magazine

రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రొమాన్స్ చేసిన అందాల రాశి కాజల్ అగర్వాల్.. మరో దగ్గుబాటి వంశపు హీరో వెంకటేష్‌తో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. వెంకటేశ్ కథానాయకుడిగా తేజ ఒక సినిమాను తెరకెక్కించడానికి సమాయత్తమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో తొలుత అనుష్కను అనుకున్నారు. కానీ వెంకటేశ్ సరసన నాయికగా కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. కాజల్‌ను తీసుకునేందుకు సెంటిమెంట్ వుందని సినీ జనం అంటున్నారు. 
 
అదేంటంటే? చాలాకాలం క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కల్యాణం' సినిమాతోనే తెలుగు తెరకు కాజల్ అగర్వాల్ పరిచయమైంది. ఈ మధ్య తేజకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేకపోవడంతో.. కాజల్ అగర్వాల్‌ను తీసుకుంటేనైనా హిట్ కొట్టొచ్చునని తేజ భావిస్తున్నట్లు తెలిసింది. 
 
ఇప్పటికే తనకి ఫస్టు ఛాన్స్ ఇచ్చాడనే కృతజ్ఞతతోనే కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి'లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడం తేజతో పాటు ఆమెకి కూడా కలిసొచ్చింది. ఆ సెంటిమెంట్ కారణంగానే వెంకటేశ్ జోడీగా కాజల్‌నే తేజ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక వెంకీతో కాజల్ నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం డిసెంబర్ 13న (వెంకీ పుట్టినరోజు) ప్రారంభం కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహేష్ బాబు ముఖ్యమంత్రి అయితే.. పోసానీ కృష్ణ మురళీ విపక్ష నేత?

స్పైడర్ సినిమాకు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా ...

news

కమల్, నేను విడిపోవడానికి శ్రుతిహాసన్ కారణం కాదు: నటి గౌతమి

సినీ లెజెండ్ కమల్ హాసన్‌ను తాను దూరం కావడానికి కారణం యంగ్ హీరోయిన్, కమల్ కుమార్తె ...

news

చిరంజీవి దయతో మళ్ళీ పుంజుకున్న వైద్యుడు... ఎవరు..? (Video)

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించి "గరుడవేగ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ...

news

గొంతెత్తితే కాల్చేస్తారా? అరవింద్ స్వామి ప్రశ్న

హిందూ తీవ్రవాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హీరో కమల్ హాసన్‌ను కాల్చి చంపాలి లేదా ...

Widgets Magazine