Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నవంబర్ 7న కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ

గురువారం, 5 అక్టోబరు 2017 (08:53 IST)

Widgets Magazine
kamal haasan

ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల నవంబర్ 7న తన 63వ పుట్టిన రోజును పురస్కరించుకుని రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. బుధవారం చెన్నైలో తన అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీపై చర్చించారు. పార్టీ, ఎజెండాపై కూడా తన మనసులోని భావాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కమల్‌ అభిమానులకు సంకేతాలిచ్చినట్లు సమాచారం. 
 
వాస్తవానికి వచ్చే యేడాది జనవరిలో రాజకీయ ప్రవేశం చేస్తానని గతంలో కమల్ చెప్పారు. అభిమానులతో సమావేశం అనంతరం కొత్త పార్టీని త్వరగా పెట్టాలని కమల్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని, రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు రాజకీయాల్లోకి రానున్నట్లు కమల్‌హసన్‌ ఇదివరకే ప్రకటించారు.
 
అయితే, చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో కేవలం పుట్టినరోజున చేపట్టే సేవా కార్యక్రమాల గురించి మాత్రమే చర్చించినట్లు కమల్‌హాసన్ వెల్ఫేర్‌క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు వెల్లడించడం కొసమెరుపు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

PK ఫ్యాన్స్ పిచ్చి పీక్స్‌లో వుందిగా... రేణూ ట్వీట్ పైన మహేష్ కత్తి

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మద్దతుగా మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో పోస్టింగు ...

news

'బిగ్ బాస్' సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!

తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ ...

news

ఉమర్ సంధు ట్వీట్‌లో నిజంలేదు.. హీరో ప్రభాస్ ప్రతినిధులు

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో ...

news

హవ్వా.. అనసూయ అలా చేసేందుకు సిద్ధమైంది...

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద ...

Widgets Magazine