Widgets Magazine

సావిత్రినే నాన్నకు మద్యం అలవాటు చేశారు.. కుక్కలను ఉసిగొల్పి గెంటేశారు..

గురువారం, 17 మే 2018 (12:55 IST)

మహానటిపై ప్రశంసల వర్షం... కలెక్షన్ల జల్లు కురుస్తున్న వేళ.. ‘మహానటి’ సినిమా చిత్ర యూనిట్‌పై సావిత్రి భర్త జెమినీ గణేశన్ కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ మండిపడ్డారు. సినిమా చాలా బాగుందని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కితాబిచ్చిన వేళ, కమలా సెల్వరాజ్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కారణం తన తండ్రి, సినీ నటుడు జెమినీ గణేశన్ పాత్రేనని ఆమె విమర్శించారు.
 
మహానటిలో తన తండ్రి పాత్రను తప్పుగా చిత్రీకరించారని, జెమినీ గణేశన్‌కు కళంకం తెచ్చిపెట్టారని కమలా సెల్వరాజ్ ఆరోపించారు. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్టు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కంటే ముందు జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లలను కూడా కన్నారని గుర్తు చేశారు. 
 
కానీ మహానటిలో తొలి ప్రేమ సావిత్రిపై కాదని, తన తల్లిపైనేనని జెమినీ గణేశన్ కూతురు అన్నారు. సినిమాలో చూపించినట్టు సావిత్రికి నాన్న మద్యం అలవాటు చేయలేదని, సావిత్రే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని చెప్పారు. ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను కాదల్ మన్నన్ అని పిలుస్తారని..  ప్రేక్షకుల ఆదరణతోనే ఆ అవార్డు ఆయనకు దక్కిందని ఆమె గుర్తు చేశారు. 
 
సావిత్రిని కాపాడింది తన తండ్రే అని పేర్కొన్నారు. ప్రాప్తం సినిమా నుంచి వెనక్కి తగ్గాలని చెప్పేందుకు నాన్నతో కలిసి తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్తే.. కుక్కలను ఉసిగొల్పి గెంటేశారని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి కాదు.. బరువు తగ్గడంలో అనుష్క బిజీ బిజీ.. గోపిచంద్‌తో?

బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ ...

news

పెళ్లికి ముందు అది కోల్పోయినా తప్పులేదు .. ఆ వీడియోలు చూస్తూ దొరికిపోయా..?

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం ...

news

మహాభారతంలో శ్రీకృష్ణుడిగా ఎవరు..? అర్జునుడిగా ఎవరు కనిపిస్తారంటే?

''మహాభారతం'' తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. సన్నాహాలు చేస్తున్నట్లు ...

news

ఖుషీ ఖుషీగా సమంత.. ఆటో ఎక్కి ఎక్కడికెళ్తుందో..?

టాలీవుడ్ అందాల నటి సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం హిట్ సినిమాలను తన ఖాతాలో ...

Widgets Magazine