శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (16:10 IST)

ప్రభాస్ అంటే ఇష్టం.. ఆయనతో మళ్లీ చేయాలనివుంది : కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా 'మణికర్ణిక' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, తాను ప్రభాస్‌తో కలిసి ఓ చిత్రం చేశాను. ఆ చిత్రం పేరు 'ఏక్‌నిరంజన్'. కానీ అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ కాదు. కానీ ఇపుడు ప్రభాస్ అలా కాదు. ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. 
 
నిజానికి 'ఏక్ నిరంజన్' చిత్రం షూటింగ్ సమయంలో తామిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఒకరినొకరు టీజ్ చేసుకునేవాళ్ళం. పైగా, ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. ఒకప్పటి ప్రభాస్‌ను.. ఇప్పటి ప్రభాస్‌ను చూస్తుంటే ఆయన ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎదుగుదల చూస్తుంటే ఎంతో గర్వంగా వుంది. ప్రభాస్‌తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఇక ప్రభాస్ తర్వాత నేను కలిసి నటించాలనుకునే మరో హీరో మహేశ్ అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.