సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (19:00 IST)

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన మృతి

Spandana
Spandana
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర 'మాస్ లీడెన్', 'జానీ', 'లాల్గుడి డేస్' వంటి కన్నడ చిత్రాల్లో నటించి అభిమానుల్లో బాగా పేరు తెచ్చుకున్నారు. అతని భార్య స్పందన. వారిద్దరూ 2007లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ రాఘవేంద్ర, స్పందన దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఇటీవల కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో స్పందన తక్కువ రక్తపోటు కారణంగా ఆసుపత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ఇకపోతే.. స్పందన పార్థివదేహాన్ని మంగళవారం బెంగుళూరుకు తీసుకురాగా, అక్కడ ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. స్పందన రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.కె. శివరామ్ కుమార్తె. ‘అపూర్వ’ సినిమాలో ఆమె స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించడం గమనార్హం.