ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (09:23 IST)

పరమశివుని పరమ భక్తుడు కన్నప్ప ప్రయాణం మొదలైంది

kannappa poster
kannappa poster
విష్ణు మంచు విభిన్న మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లోనూ మెప్పించారు. ప్రస్తుతం ఆయన కన్నప్ప అంటూ పాన్ ఇండియా వైడ్‌గా సందడి చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ కన్నప్ప సినిమాను విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. 
 
నేడు  విష్ణు మంచు పుట్టిన రోజు సందర్భంగా కన్నప్ప చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ తో కన్నప్ప పోస్టర్ ను విడుదల చేశారు. నాస్తిక యోధుడు పరమశివుని పరమ భక్తుడు కన్నప్ప  ప్రయాణం ప్రాణం పోసుకుంది అని కాప్షన్ పేట్టి పోస్ట్ చేశారు. ఇక అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్లు కన్నప్ప చిత్రంలో నటిస్తుండటంతో భారీగా క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్లు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.