శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (12:41 IST)

నాని 'బిగ్‌బాస్‌'లో మసాలా ఉంది కానీ ఫ్లేవర్ మిస్సయింది : కత్తి కార్తీక

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కం

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న కత్తి కార్తీక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
నాని 'బిగ్ బాస్-2' రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని చెప్పుకొచ్చింది. 
 
తెలంగాణ జానపదమో, ఆ భాషనో హౌస్‌లో ఉంటే, ఆ మసాలా ఘాటు తగిలేదని తెలిపింది. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్‌ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. 
 
తొలి సీజన్‌లో ముగ్గురు తెలంగాణ వాళ్లకు చోటుదక్కిందని గుర్తు చేసిన కార్తీక... రెండో సీజన్‌లో మాత్రం అది ఎక్కడా కనిపించలేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది.