మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (11:02 IST)

కీర్తి సురేష్‌ని అచ్చం సావిత్రిలాగే మలిచిన దర్శకుడు...

సీనియర్ దివంగత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఒకవైపు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఈ చిత్రం

సీనియర్ దివంగత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఒకవైపు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఈ చిత్రంలోని పాత్రల పేర్లను దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడిస్తున్నారు.
 
ముఖ్యంగా, మూవీపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ లుక్‌కి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అచ్చం సావిత్రిలాగే అంతలా ఒదిగిపోయిన‌ కీర్తి ఫోటో చూసి అభిమానులు మెస్మ‌రైజ్ అవుతున్నారు. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
అచ్చం సావిత్రిలా ఉన్న‌కీర్తి ఫోటోకి స‌మంత చాలా బాగుంది అనే కామెంట్ పెట్టింది. కారెక్టర్ల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న నాగ్ అశ్విన్.. కీర్తి సురేష్‌ని అచ్చం సావిత్రిలాగే మలిచేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా లుక్స్ ఆకట్టుకున్నాయి. 
 
కాగా, చిత్రంలో మ‌ధుర వాణి పాత్రని స‌మంత పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎల్వీప్ర‌సాద్‌గా అవ‌స‌రాల, కేవి రెడ్డిగా క్రిష్ క‌నిపించ‌నున్నారు. అయితే లుక్ పరంగా సావిత్రిని గుర్తుకి తెస్తున్న‌ కీర్తి సురేష్, అసమాన్య నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిలా నటించి మెప్పించగలదా లేదా అనేది సస్పెన్స్. ఈ సినిమాలో కీర్తి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది.