గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (08:43 IST)

ఆర్ఆర్ఆర్ కథ ఓవర్.. కేజీఎఫ్ రికార్డుల మోత..

kgfheroyash
కేజీఎఫ్ 2 చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే రికార్డుల వేటను మొదలుపెట్టినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నార్త్‌లో కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా, అక్కడ ఈ టికెట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతున్నాయట. 
 
నార్త్‌లో కేజీఎఫ్ 2 చిత్రాన్ని 3000+ స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తుండగా, గురువారం నాడు మల్టీప్లెక్స్‌లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా ఆర్ఆర్ఆర్ చిత్ర రికార్డులను క్రాస్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
 
టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఆడియెన్స్ కేజీఎఫ్ 2 చిత్ర టికెట్లను ఎగబడి కొంటున్నారట. ఇక ఆదివారం లేదా సోమవారం నాటికి సింగిల్ స్క్రీన్ టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయనుండటంతో ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు తొలిరోజు కేజీఎఫ్ 2 చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రావచ్చని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
అయితే అదే రోజున జెర్సీ మూవీ కూడా రిలీజ్ అవుతుండటంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జెర్సీ వర్సెస్ కేజీఎఫ్ 2 క్లాష్ ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.