బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:55 IST)

ధనూష్... నీ సినిమాలను నిర్మించి బతుకు బస్టాండ్: ఎవరు?

కోలీవుడ్‌లో ధ‌నుష్ పైన నిర్మాతలు మండిప‌డుతున్నారు. ఇంత‌కీ ఏమైంది..? ఆ.. హీరోతో సినిమా తీస్తే బ‌తుకు బ‌స్టాండే అంటున్నారు నిర్మాత‌లు. ఇలా నిర్మాత‌లు బ‌హిరంగంగా కామెంట్ చేయ‌డానికి కార‌ణం కూడా ఆ హీరోనే. అవును.. ఇది నిజంగా నిజం. 
 
మేట‌ర్ ఏంటంటే... తమిళ హీరో ధనుష్‌ తన నోరును కంట్రోల్‌లో పెట్టుకోలేదు. దాంతో అతను విసిరిన పంచ్‌ రివర్స్‌ స్వింగ్‌ అయి అతనికే తగిలింది. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... నిర్మాతల నుంచి పారితోషికం వసూలు చేసుకోవాలంటే తల ప్రాణం తోకకి వస్తోందన్నాడు.
చాలామంది నిర్మాతలు ఇస్తామ‌ని చెప్పిన‌ మనీని ఇవ్వ‌డం లేద‌ని చెప్పాడు. ఈ మాటలతో తమిళ నిర్మాతలకి బాగా కాలింది. 
 
ఆయనతో సినిమాలు తీసిన పలువురు నిర్మాతలు ధనుష్ పైన ఫైర్ అయ్యారు. నీ కెరియర్‌లో ఎన్నో సినిమాలు చేశావు క‌దా. నీ సినిమాల‌తో ఎంతమంది నిర్మాత‌లకు లాభాలు వ‌చ్చాయో చెప్పగలవా? ఒక చేతికున్న వేళ్లని మించి ఉండ‌రు అలాంటి నిర్మాతలు. అదీ నీ స్టార్‌ స్టేటస్‌.
 
 నీ సినిమాలను నిర్మించి బతుకు బస్టాండ్‌ చేసుకున్న నిర్మాతలకి నువ్వు చేసిన సాయం ఏంటి..? అని ప్ర‌శ్నించారు. ఇపుడు వచ్చి నిర్మాతలను విమర్శిస్తున్నావు అంటూ ఆయన పాత నిర్మాతలు ధనుష్‌ సినిమా చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్టారు.