శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (22:47 IST)

క్రిష్ - సురేందర్ రెడ్డి చేతులు కలిపారు, ఇంతకీ విషయం ఏంటి..?

గమ్యం సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి... తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి.. అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యారు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
 
ఇక సురేందర్ రెడ్డి విషయానికి వస్తే... అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. తొలి ప్రయత్నంలోనే సక్సస్ సాధించాడు. స్టైలీష్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
 
 ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు క్రిష్ - సురేందర్ రెడ్డి ఈ ఇద్దరూ చేతులు కలిపారని తెలిసింది.
 
ఇంతకీ.. మేటర్ ఏంటంటే... క్రిష్ రాసిన కథను సురేంద్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని తెలిసింది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే... మెగా హీరో వరుణ్ తేజ్ అని టాక్.
 
వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఎఫ్ 3 సినిమాలో కూడా నటించనున్నాడు. అలాగే క్రిష్ - సురేందర్ రెడ్డి కలిసి రూపొందించనున్న సినిమాలో కూడా నటించేందుకు ఓకే చెప్పాడట. మరి.. ఈ క్రేజీ మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.