శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (17:45 IST)

మలయాళ, తమిళ సినిమాల్లో బేబెమ్మ.. తెల్ల లెహంగాలో అదుర్స్

Krithi Shetty
Krithi Shetty
కృతి శెట్టి ఉప్పెనలో బేబెమ్మగా కలలోకి అడుగుపెట్టింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజులో ఆ తర్వాత కనిపించింది. కానీ వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి నిరాశపరిచిన సినిమాలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ ఆమె తాజా చిత్రం మనమే కూడా అదే కోవలోకి వస్తుంది.  
Krithi Shetty
Krithi Shetty
 
ప్రస్తుతం కృతి చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. టోవినో థామస్, జయం రవితో కలిసి రాబోయే ప్రాజెక్ట్‌లతో పాటు మలయాళం, తమిళ పరిశ్రమలకు మారింది. కృతికి తమిళం, మలయాళ సినిమాలలో మంచి పాత్రలు లభిస్తాయని టాక్ వస్తోంది. 
Krithi Shetty
Krithi Shetty
 
ఈ నేపథ్యంలో కృతి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ వైట్ లెహంగాలో.. దివి నుంచి భువికి.. దిగివచ్చిన ఏంజెల్ లాగా కనిపించి అందరిని ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.