సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 26 జులై 2017 (08:10 IST)

బికినీకే జెలసీ పుట్టించిన రాయ్ లక్ష్మి ఫొటో షూట్. నోరెళ్లబెట్టిన బాలీవుడ్

అందానికి అందం పుత్తడిబొమ్మా అనేది చాలా పాత మాట. బికినీయే బిత్తరపోయేలా చేసే అందం అంటే అది ఇప్పుడు మన హీరోయిన్లకు చాలా చక్కగా నప్పుతుంది కాబోలు. తన అందాల ప్రదర్శనతో, బాడీ ఫిజిక్‌తో అగ్ర హీరోలను కూడా గుక్క తిప్పుకోనీకుండా చేసిన రాయ్ లక్ష్మి దక్షిణాదిన స

అందానికి అందం పుత్తడిబొమ్మా అనేది చాలా పాత మాట. బికినీయే బిత్తరపోయేలా చేసే అందం అంటే అది ఇప్పుడు మన హీరోయిన్లకు చాలా చక్కగా నప్పుతుంది కాబోలు. తన అందాల ప్రదర్శనతో, బాడీ ఫిజిక్‌తో అగ్ర హీరోలను కూడా గుక్క తిప్పుకోనీకుండా చేసిన రాయ్ లక్ష్మి దక్షిణాదిన స్టన్నింగ్ బ్యూటీగా మతులు పొగొట్టేసింది. సినిమాకోసమే పుట్టినట్లున్న ఈ సౌందర్యవతి తాను చేసిన సినిమాల్లో నూటికి నూరుపాళ్లూ అందాల ప్రదర్శనకు న్యాయం పోసిందన్నది వాస్తవం. 
 
సినిమా ఆంటే ఆమెకు ఎంత పిచ్చో, ఆసక్తో ఇటీవల సోషల్ మీడియలో విడుదల చేసిన ఫోటోలే సాక్ష్యం. కళ్లు చెదిరే అందంతో బికినీలో తీసిన ఫోటోను పోస్ట్  చేసిన రాయ్ సినిమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇండియన్ సినిమాలో భాగమైనందుకు గర్విస్తున్నాను. హార్డ్ వర్కే నా లైఫ స్టయిల్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టిన ఆమె బికినీలో అందాలను బాలీవుడ్ ముందు అలా పర్చేసింది. 
 
ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను చిత్తు చేసిన ఈ అతిలోక సౌందర్యం ఇప్పటికే సోనాక్షీ సిన్హా తీసిన అకీరా సినిమాలో నటించి బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. అకీరాలో ఒక కామెడీ పాత్రలో నటించినప్పటికీ షూటింగులో ఫోటోషూట్ సందర్బంగా తీసిన ఫోటోలు బాలీవుడ్‌లో ప్రతి ఒక్కరికీ అమెను పరిచయం చేసేశాయి.