శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (21:09 IST)

మీరు నిజంగా లోకేష్ పప్పు ఫాదరే... బాబుపై వ‌ర్మ‌ ఘాటు కామెంట్...

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన వివాద‌స్ప‌ద చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా తెలంగాణ‌లో విడుద‌ల అయ్యింది కానీ... ఏపీలో రిలీజ్ కాలేదు. ఆ త‌ర్వాత వ‌ర్మ సుప్రీంకోర్ట్ వ‌ర‌కు వెళ్ల‌డం... ఏపీ హైకోర్ట్ సినిమాని చూడాల‌న‌డం... వాయిదా ప‌డ‌డం తెలిసిందే. ఎన్నిక‌లు ముగియ‌డంతో మే 1న ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను రిలీజ్ చేయ‌డానికి కోర్ట్ అనుమ‌తి ఇచ్చింది.
 
దీంతో వ‌ర్మ విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అయితే... అక్క‌డ హోట‌ల్ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టేందుకు నిరాక‌రించ‌డంతో విజ‌య‌వాడ న‌డి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడ‌తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత పోలీసులు రంగంలోకి దిగి వ‌ర్మ‌ను పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌డం.. ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా హైద‌రాబాద్‌కి పంపించ‌డం జ‌రిగింది. 
 
దీంతో వ‌ర్మ‌కు బాగా మండింది. 40 ఏళ్ల పొలిటిక‌ల్ కెరీర్ ఉన్న చంద్ర‌బాబు నువ్వు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసి భ‌య‌ప‌డుతున్నావా..?  ఇప్పుడు నిజంగా ప్రూవ్ అయ్యిందేమిటంటే మీరు లోకేష్ ప‌ప్పు ఫాద‌రేననీ.. అని ఘాటుగా స్పందించాడు ట్విట్ట‌ర్లో వ‌ర్మ‌. దీనికి బాబు కానీ లోకేష్ బాబు కానీ స్పందిస్తారో లేదో..!