సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (18:39 IST)

వెంకీ మామ కోసం వచ్చేశానండీ.. పాయల్ రాజ్ పుత్

విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య నటిస్తున్న సినిమా ''వెంకీ మామా''. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి గట్టున గల ఓ పచ్చటి పల్లెలో చిత్రీకరణ జరుగుతోంది. రాశీ ఖన్నా శనివారం సెట్స్‌లో జాయినైంది. 
 
అలాగే పాయల్ కూడా సెట్స్‌లోకి వచ్చేసింది. ఈ మేరకు వెంకీ మామ షూటింగ్‌లో తాను చేరిపోయానని పాయల్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఓ ఫోటోను జత చేసింది. ఇక్కడ రెండు వారాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని టాక్ వస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు.