Widgets Magazine

మహానేత వైఎస్సార్ బయోపిక్‌లో లేడీ సూపర్ స్టార్.. (వీడియో)

శుక్రవారం, 9 మార్చి 2018 (15:02 IST)

Nayanatara

మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు.

ఈ చిత్రంలో వైఎస్ఆర్ భార్యగా నటించేందుకు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. అయితే, చిత్ర దర్శకుడు, నిర్మాత మాత్రం కేరళ కుట్టి నయనతారను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గతంలో మమ్ముట్టి - కాంబినేషన్‌లో వచ్చిన 'భాస్కర్ ది రాస్కెల్', 'పుతియా నియమం' వంటి పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వైఎస్ఆర్ బయోపిక్‌ను నిర్మించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. 
 
కాగా, ఈ చిత్రానికి 'ఆనందో బ్రహ్మ' సినిమాతో హిట్ కొట్టిన మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
అలాగే, నయనతార తన ప్రియుడు తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి యూఎస్‌లో సమ్మర్ వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను కూడా ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది.
 
మరోవైపు..మలయాళ కుట్టి నయనతార ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం "కర్తవ్యం". ఇది తమిళ చిత్రం "అరం"కు రీమేక్. మింజుర్ గోపి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కంప్లీట్ మెసేజ్ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కింది. నీటి కోసం తల్లాడే రైతుల వెన్నంటే నిలిచి వారి కష్ట నష్టాలలో భాగస్వామి‌గా నిలిచే కలెక్టర్ పాత్ర పోషించింది. 
 
ఈ మూవీని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. 'కాకాముట్టై' ఫేం రమేష్, విఘ్నేష్, సును లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మీ లైక్స్ కోసం ఇలా గాలి వార్తలు ప్రచారా చేస్తారా?: హీరో శ్రీకాంత్ ఆగ్రహం

ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా ...

news

ఎమ్మెల్యే కుమార్తెతో సినీ దర్శకుడి వివాహం... ఎక్కడ?

ఓ ఎమ్మెల్యే కుమార్తెతో ఓ సినీ దర్శకుడి వివాహం గుడిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ...

news

ఈయన వెంకీనా...? లుక్ అదిరిపోయిందిగా....!!

విక్ట‌రీ వెంక‌టేష్...తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ...

news

పోకిరి భామకు కోపమొచ్చింది.. అజయ్‌తో సంబంధమా.. ఫన్నీగా వుంది

''పోకిరి'' భామ ఇలియానా మళ్లీ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చిన ...

Widgets Magazine