శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (19:48 IST)

లవ్ & క్రైమ్ థ్రిల్లర్- ఆధారం- ఫస్ట్ లుక్

Aadharam poster
మోహన్ బాబుతో`కేటుగాడు` నిర్మించిన వల్లూరిపల్లి వెంకట్రావు వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి నిర్మిస్తున్న చిత్రం `ఆధారం`. శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ (నూతన పరిచయం) నిరోషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న‌.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
 
అనంతరం ఆయ‌న మాట్లాడుతూ, నిర్మాత గోపి కొత్త కథలతో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఎప్పటినుంచో నాతో అనేవాడు.  ఆ క్రమంలోనే ఈ "ఆధారం"తోప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లవ్ ఎమోషన్,థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకురావాలి. ఈ సినిమా పాటలు చాలా బాగా ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి గోపి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అన్నారు.
 
చిత్ర దర్శక నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ, మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో కొత్త నటీ నటులతో ఈ సినిమా చేస్తున్నా.ఈ సినిమాకు  డైలాగ్స్, డైరెక్షన్ అన్ని నేనే రాసుకొని సినిమాను డిసెంబర్ లో  షూటింగ్ ప్రారంభించి ఫస్ట్ షెడ్యూల్ చేశాను. డిసెంబర్ లో సెకండ్ షెడ్యూల్ చేద్దామనుకున్న టైం లో కరోనా స్టార్ట్ అయింది 
కరోనా టైంలో కూడా  మా ఆర్టిస్టులంతా ఎంతో కేర్ తీసుకుని మాకు సపోర్ట్ నిలిచి ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి సహాయ పడ్డారు. మా ఆధారం సినిమా నిలబడ్డానికి ముఖ్య కారకుడు హీరో భరత్ చంద్ర చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇతను మంచి హీరో అవుతాడు.హీరోయిన్ చాలా చక్కగా నటించింది. నజీర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం క్రైమ్ థ్రిల్లర్  అంశంతో ముందుకెళ్తుంది. ఇందులో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. అంబట్ల రవి మంచి లిరిక్స్ ఇచ్చారని తెలిపారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ మాట్లాడుతూ ..ఇది నా మొదటి సినిమా ఇందులో రెండు పాటలు ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. లిరిక్ రైటర్ అంబట్ల రవి మాట్లాడుతూ..  గోపి గారుఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాతో  ఆయన కష్టం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరికీ ఆధారం సినిమా ద్వారా దారి చూపిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
హీరో సూర్య, హీరోయిన్ రేణు శ్రీతోపాటు బొగతా సత్యనారాయణ, తులసి శ్రీనివాస్, వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, ఈ సినిమా గొప్ప విజయం సాదించాల‌ని ఆకాంక్షించారు.