శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (14:02 IST)

లవ్‌స్టోరీ రీ షూట్: చైతూ, సాయిపల్లవి ఎక్స్ ట్రా డేట్స్ ఇచ్చారట..

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మజిలీ, వెంకీమామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన నాగచైతన్య లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతు, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 
 
ఇటీవల చైతు, సాయిపల్లవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు అనుకుంటే.. ఇంతలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించారని తెలిసింది.
 
రషెష్ చూసుకున్న శేఖర్ కమ్ములకు కొన్ని ఇంప్రూవ్‌మెంట్లు అవసరం అనిపించాయట. వెంటనే... రీషూట్లు స్టార్ట్ చేసాడని సమాచారం. ఈ షెడ్యూల్‌లో కేవలం రీషూట్లే జరగబోతున్నాయట. అటు చైతూ, ఇటు సాయిపల్లవి సైతం ఎక్స్ ట్రా డేట్స్ ఇచ్చారని తెలిసింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాని డైలీ సీరియల్‌లా అద్భుతంగా తీస్తున్నారని తెలిసింది. 
 
ఇలా ఓ వైపు రీషూట్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నారని తెలిసింది. ఇక లవ్ స్టోరీ రిలీజ్ విషయానికి వస్తే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున లేదా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.