మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (19:33 IST)

బాబు గోగినేనిపై మాధవీలత ఫైర్.. అయ్యగారి కథేంటో బిగ్ బాస్‌లో చూసేశాం.. మూతి మీద..?

ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేనిపై సినీ నటి, బీజేపీ నాయకురాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిందువుల గురించి తక్కువగా మాట్లాడితే.. సహించేది లేదని మాధవీలత వార్నింగ్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా.. అతన్ని వెధవ, సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. హిందువుల గురించి మరోసారి తక్కువ చేసి మాట్లాడితే.. మూతి మీద వాతలు పెడతాం అంటూ హెచ్చిరిస్తూ తన ఫేస్‌బుక్‌లో వీడియో విడుదల చేసింది మాధవీలత. 
 
ఆ వీడియోలో మాధవీ లత మాట్లాడుతూ.. హిందువులపై ఎవడు పడితే వాడు పడి ఏడుస్తున్నారు. అందులోనూ ఈ తెలుగు రాష్ట్రాల్లో బాబు గోగినేని అనేవాడ్ని స్టుడియోల్లో కూర్చోబెట్టుకుని చర్చలు జరిపిస్తున్నారు. జ్యోతిష్యం చూసి కరోనా తగ్గుతుందని చెప్పిన వారిపై చర్చలా..  పాపం ఆ జోతిష్కుడు ఏదో పొట్ట తిప్పలకోసమో.. నక్షత్రం చూసో కరోనా తగ్గుతుందని చెప్పాడేమో.. ఆ మాత్రం దానికి టీవీ డిబేట్‌లు పెడతారా అంటూ మండిపడింది. 
 
ముఖ్యంగా ఆ బాబూ గోగినేని హిందువులపై పడి ఏడుస్తాడు. ఆయన హేతువాది అయితే కావచ్చు.. మేం హిందువులం దేవుడ్ని నమ్మతాం. అంతేతప్ప వేరే వాళ్లలా మా మతంలోకి రండ్రా బాబూ.. బేరం కుదిరింది.. అని ఎవడి ఇంటికి వెళ్లము. మా మతంలోకి రండి అని హిందువులు ఎవరూ అడుక్కోవడం లేదు. బాబు గోగినేనికి దేవుడి పట్ల నమ్మకం లేకపోతే మూసుకుని ఉండమనండి. 
 
సాంఘిక దురాచారాలపై మాట్లాడండి.. అలాంటి వాటికి సపోర్ట్ చేస్తాం. ఈ బాబు గోగినేని గురించి ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నా.. నేను బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు.. ఇప్పుడు గుర్తుకు వచ్చింది. బాబు గోగినేని బాగా కడిగేసి.. ఉతికేసి.. తోమేసి.. గిన్నెలు కడిగినట్టు బాగా కడిగి బాగా మెరిపించాలని అనుకుంటున్నానని ఫైర్ అయ్యింది. అంతేకాకుండా.. మంచి ఆర్గానిక్ సోప్‌తో తోమేస్తా. ఈ బాబు గోగినేని హిందువుల గురించి మాట్లాడేటంత గొప్ప మనిషి కాదని విమర్శించింది. 
 
అయ్యగారి కథేంటో బిగ్ బాస్‌లో చూసేశాం.. ఈయన ఈక్వాలిటీ.. ఇతని చుట్టూ చేరి జపం చేసేటోళ్లని తప్ప మిగిలిన వాళ్లని ఎలా ద్వేషిస్తారో.. ఎంత పగ లోపల పెట్టుకున్నాడు.. ఒక మనిషిని బయటకు పంపించడానికి ఇతను చేసిన కుట్రలు, పగలు, ప్రతీకారాలను బిగ్ బాస్‌లో చూశాం.. కొత్తగా ఆయన గురించి చెప్పక్కర్లేదని మాధవీ లత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 
 
"అసలు నువ్ మర్యాదకు అర్హుడివి కాదు. ఎంతసేపూ జోతిష్యులపై పడి ఏడుస్తున్నావు. తగ్గిపోతుందనే ఆలోచన కూడా మంచిదే కదా. మీకు కర్చీఫ్‌లు ఇస్తాం.. కింద తుడుస్తాం పైన తుడుస్తాం అని చెప్పేవారి వల్ల సమాజం ఎంత నష్ట పోతుందో తెలుసా? పిచ్చి వెర్రి వెధవా.. అక్కడ నక్షత్రాల కదలికలను బట్టి ఆయన జోతిష్యం చెప్పారు. భారతదేశం గురించి తప్పుగా మాట్లాడతావా? సన్నాసి, సన్నాసి వెధవ బాబు గోగినేని.. అంటూ వీడియోలో ఏకి పారేసింది మాధవీ లత.