గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 3 జూన్ 2019 (20:09 IST)

మహేష్ బాబుకు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

మహేష్ బాబు సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడా.. గతంలో కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టి అలా మళ్ళీ జరగకుండా ఉండేందుకు మహేష్ బాబు అసలేం చేస్తున్నాడు. దీంతో పాటు మరో సెంటిమెంట్‌ను కూడా మహేష్ ఫాలో అవుతున్నాడట. 
 
సరిలేరు నీకెవ్వరు కోసం మహేష్ మహర్షి సెంటిమెంట్‌ను ఫాలో అయ్యాడు. మహర్షిని ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి నిర్మించగా... సరిలేరు నీకెవ్వరు సినిమాను ముగ్గురు నిర్మాతలు తీస్తున్నారు. మహేష్ ఇలా ముగ్గురు నిర్మాతల సెంటిమెంట్‌ను ఫాలో అయితే దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం తనకున్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడు.
 
పటాస్, సుప్రీం, రాజా దిగ్రేట్, ఎఫ్‌ 2 వంటి ఇంగ్లీష్‌, హిందీ టైటిల్స్ పెట్టే అనిల్ రావిపూడి ఫస్ట్ టైం సరిలేరు నీకెవ్వరు అనే తెలుగు టైటిల్‌తో వస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పదమూడేళ్ళ తరువాత రీ-ఎంట్రీ ఇస్తున్నారు.