మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (13:58 IST)

బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

bill gates
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో మహేష్ దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. "బిల్ గేట్స్‌ను కలవవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయన ఒకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి" అని మహేష్ బాబు అన్నారు. 
 
కాగా, మరో రెండు రోజుల్లో మహేష్ బాబు భారత్‌కు రానున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రంలో ఆయన నటిస్తారు. ఆ తర్వాత పూజా హెగ్డే చిత్రంలో మహేష్ బాబు నటిస్తారు.