బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (22:54 IST)

కోట శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి తెలుసుకున్న మహేష్‌

Kota Srinivasa Rao, Mahesh Babu
Kota Srinivasa Rao, Mahesh Babu
సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించడానికి కోట శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ విషయం తెలియగానే మహేష్‌ దగ్గరకు వెళ్ళి కోట శ్రీనివాసరావు తీసుకువచ్చారు. నివాళి అనంతరం అక్కడే కుర్చీలో కూర్చుని కోట ఆరోగ్యం గురించి వాకబు చేశారు మహేష్‌. కృష్ణగారితో వున్న అనుబంధాన్ని కోట శ్రీనివాసరావు గుర్తుచేసుకున్నారు. ఆయన చేసిన సేవలే ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారంటూ కోట తెలియజేయడం విశేషం.
 
అనంతరం మహేష్‌ బాబు, కోట శ్రీనివాసరావు ఆరోగ్యం గురించి అడగగా, తన గురించి చెబుతూ, ఏముంది, టైం కోసమే చూస్తున్నానంటూ తనదైనశైలిలోనే స్పందించారు. తనకు కాళ్ళ నొప్పులు వున్నాయంటూ.. మహేష్‌కు కాళ్ళను చూపిస్తూ వయసు కదా.. అంటూ కోట శ్రీనివాసరావు అనడం అక్కడివారిని ఆశ్చర్యంగానూ సానుభూతికి గురయ్యారు. మీ నాన్నగారి ఆశీస్సులు మీకు వుంటాయంటూ కోట అన్నారు.