సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (16:06 IST)

ఫుట్‌బాల్ అడుకుంటున్న పీకే ఫ్యాన్స్... నేనేం పాపం చేశానంటున్న మహేష్ కత్తి (Video)

తెలుగు 'బిగ్ బాస్' షోలో పాల్గొని, ఎలిమినేట్ అయిన గుర్తింపు తెచ్చుకున్న సినీ విశ్లేషకుడు, నటుడు మహేష్ కత్తి. ముఖ్యంగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సంచలన విమర్శలు చేసి బోలెడంత

తెలుగు 'బిగ్ బాస్' షోలో పాల్గొని, ఎలిమినేట్ అయిన గుర్తింపు తెచ్చుకున్న సినీ విశ్లేషకుడు, నటుడు మహేష్ కత్తి. ముఖ్యంగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సంచలన విమర్శలు చేసి బోలెడంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటినుంచి వార్తల్లో నిత్యం నిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాసిన "ఇజం" పుస్తకం చూస్తే తనకు అసలు పవన్ తీరు ఏంటా అని ఆలోచనలో పడిపోయినట్లు తెలిపారు. 'ఇజం' పుస్తకాన్ని ఐదో తరగతి విద్యార్థి కంటే హీనంగా రాసి తికమక పెట్టారంటూ విమర్శించారు.
 
ఈ 'ఇజం' పుస్తకంపై బాగా పరిశోధన చేస్తే తనకు ఓ విషయం బోధపడిందనీ, ప‌వ‌న్ తను తిక‌మ‌క ప‌డటమే కాకుండా ఆయ‌న అభిమానుల‌ను, ప్ర‌జ‌ల‌ను కూడా తిక‌మ‌క పెడుతున్నారంటూ కత్తి విమర్శలు గుప్పించారు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే పవన్ అనే ఓ మూర్ఖ‌త్వాన్ని ఆయ‌న అభిమానులు నెత్తిన వేసుకుని తిరుగుతున్నార‌ంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ ఎవరో తన వెనుక ఉండి చేయిస్తున్నవి కావనీ, పవన్ 'ఇజం' చూశాక మాత్రమే తను ఇలా మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
 
అయితే, ఈ వ్యాఖ్యలు పీకే ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మహేష్ కత్తి ఫోన్ నంబరును సంపాదించిన పీకే ఫ్యాన్స్... సోషల్ మీడియాలోని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రూపులకు షేర్ చేశారు. ఆ తర్వాతే మహేష్ కత్తికి నిద్రలేకుండా పోయింది. రోజుకు కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి. బూతులు తిడుతూ ఎస్ఎంఎస్‌లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో కూడా బూతులతో కూడిన ట్వీట్లు చేస్తున్నారు. ఇక వాట్సాప్ గురించి చెప్పనక్కర్లేదు. దీంతో విసిగిపోయిన మహేష్ కత్తి... ఫేస్‌‌బుక్ ద్వారా తన మనసులోని బాధను పంచుకున్నారు. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.