సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (12:10 IST)

భోజ్‌పురి హీరోయిన్ రీతు సింగ్‌కు షాక్.. హోటల్ గదిలో వుంటే..?

బోజ్‌పురి హీరోయిన్ రీతు సింగ్‌కు ఓ షాకిచ్చే సంఘటన ఎదురైంది. హోటల్ గదిలో ఒంటరిగా వున్న సమయంలో ఓ యువకుడు వున్నట్టుండి ఆ గదిలోకి ప్రవేశించాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ పదే పదే బతిమిలాడాడు. 
 
వివరాల్లోకి వెళితే.. వారణాశిలోని ఓ స్టార్ హోటల్లో బస చేసిన రీతు సింగ్‌ గదికి పంకజ్ యాదవ్ అనే యువకుడు హోటల్ గదిలోకి ప్రవేశించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే, అందుకు ఆమె తిరస్కరించింది. గట్టిగా కేకలు వేసింది. హీరోయిన్ కేకలు విన్న ఓ వ్యక్తి ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి మీద పంకజ్ యాదవ్ కాల్పులు జరిపాడు. 
 
ప్రాణభయంతో ఆ యువకుడు బయటకు పరుగులు తీశాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రీతు సింగ్‌ను పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ముంబైలోనూ సదరు యువకుడు రీతును వేధించాడట. తాజాగా వారణాసిలో కూడా హోటల్ గదిలో రీతును బెదిరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.