వేగం పెంచిన మెగా డాటర్... రాహుల్ సరసన నీహారిక

మెగా డాటర్‌గా బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌పై కనిపించిన హీరోయిన్ నీహారిక. ఈమె నటించిన "ఒక మనసు" చిత్రం నిరాశపరిచాయి. కానీ, నీహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటించిన "

niharika konidela
pnr| Last Updated: శనివారం, 23 జూన్ 2018 (12:50 IST)
మెగా డాటర్‌గా బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌పై కనిపించిన హీరోయిన్ నీహారిక. ఈమె నటించిన "ఒక మనసు" చిత్రం నిరాశపరిచాయి. కానీ, నీహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటించిన "హ్యాపీ వెడ్డింగ్" అనే చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు.
 
ఈ చిత్రం విడుదలకి ముస్తాబవుతుండగానే నీహారిక మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. ఒక సినిమాకి సుజన దర్శకత్వం వహించనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేసింది. 
 
నిర్వాణ సినిమాస్ వారు తమ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రణీత దర్శకురాలిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. దీనిపై మరింత చదవండి :