శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:59 IST)

గెట్ రెడీ టు విశ్వంభర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి అప్ డేట్

Megastar Chiranjeevi in zym
Megastar Chiranjeevi in zym
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న కొత్త చిత్రం విశ్వంభర. దర్శకుడు వశిష్టతో భారీ ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. ఇప్పటివరకు పద్మ విభూషణ్ పలుకరింపులతో ఆనందంతో పొందిన చిరు తాజాగా సినిమా కోసం కసరత్తు మొదలు పెట్టారు. రామ్ చరణ్ ట్రెయినీ పర్యవేక్షణలో జిమ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. దాంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
 
Megastar Chiranjeevi in zym
Megastar Chiranjeevi in zym
ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ని అందిస్తుండగా ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం పడుతున్న జిమ్ లో కసరత్తులు చేస్తూ స్వేదాన్ని చిందిస్తూ వున్న వారి బాస్ ను చూసి ఆనందంతో ట్రీట్ చేస్తున్నారు.

Chiranjeevi hand exercise
Chiranjeevi hand exercise
ఇక ఈ వీడియోతోనే విశ్వంభర కోసం తాను సిద్ధం అంటూ సాలిడ్ అప్డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి ఇటీవలే ఛోటా కె. నాయుడు, రామ్ లక్మణ్ లు యాక్షన్ ఎపిసోడ్ చేయనున్నట్లు తెలిపారు. దాని కోసమే రామ్ లక్మణ్ ల సూచనల మేరకు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తను ఎప్పుడు సెట్లో కి వెళ్ళేది త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.