మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (16:21 IST)

మా ఎలక్షన్స్‌పై మోహన్ బాబు సంచలన కామెంట్స్.. ఆడియో వైరల్

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగం చేశారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు మోహన్‌బాబు మా ఎన్నికలపై తనదైన స్టైల్‌లో ఓ ఆడియో రిలీజ్‌ చేశారు. ఏకగ్రీవంగా జరగాల్సిన మా ఎన్నికలు…కొందరు సభ్యుల వల్ల రచ్చకెక్కాయన్నారు మోహన్‌బాబు. తన బిడ్డ మంచు విష్ణును గెలిపించాలని మా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. 
 
గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న హామీలను తప్పక విష్ణు నెరవేరుస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మోహన్‌బాబు. కొందమంది సభ్యులు బజారున పడి నవ్వుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే మంచు విష్ణు గెలిచిన వెంటనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కష్టాసుఖాలను చెప్పుకుని సహాయ సహకరాలు తీసుకుందామని కోరారు. రేపు జరగబోయో ఎన్నికలలో ఆర్టిస్టులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మోహన్ బాబుకు సంబంధించిన ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.