శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (12:58 IST)

ఓటీటీలో సడెన్‌గా మంత్ ఆఫ్ మధు

Month of Madhu team
అష్టాచెమ్మా సినిమాలో కలర్స్ స్వాతి చాలా హుషారుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో జనాలకు దగ్గరైంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసిన స్వాతి ఈ మధ్య కాస్త స్లో చేసింది. 
 
ఈ ఏడాది మంత్ ఆఫ్ మధు అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. ఇందులో నవీన్ చంద్ర హీరోగా నటించగా, శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలైంది.
 
 థియేటర్లలో పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం తర్వాత తెలుగు OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం మరో OTTలో అందుబాటులోకి వచ్చింది. 
 
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇది తెలుగు భాషలో మాత్రమే ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది.