బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (14:39 IST)

శ్రీదేవి కడుపుపై బోనీ కపూర్ తల్లి పిడిగుద్దులు.. కాలినడకన శ్రీవారి మెట్లెక్కి?: వర్మ

ప్రముఖ సినీనటి శ్రీదేవి తన ఆరాధ్య దైవమంటూ చెప్పుకుంటున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆమె మరణానికి అనంతరం ఆ బాధను తట్టుకోలేక సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నాడు. తాజాగా శ్రీదేవితో తన జ్ఞా

ప్రముఖ సినీనటి శ్రీదేవి తన ఆరాధ్య దైవమంటూ చెప్పుకుంటున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆమె మరణానికి అనంతరం ఆ బాధను తట్టుకోలేక సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నాడు. తాజాగా శ్రీదేవితో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. శ్రీదేవికి సంబంధించి జీవితకాలంపాటు పదిలంగా దాచుకునే సందర్భం ఒకటుందని.. 1989లో అర్థరాత్రి దాటాక.. 2.30 నుంచి 4.00 గంటల మధ్య తిరుమల శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన తనతో కలిసి నడిచి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవటాన్ని పుస్తకంలో నెమలీకను దాచుకున్నట్లే.. గుర్తు పెట్టుకుంటానని వర్మ చెప్పుకొచ్చారు. 
 
"క్షణ క్షణం" సినిమా శ్రీదేవికి తన లవ్ లెటర్ లాంటిదని.. వర్మ తెలిపాడు. "శివ"తో తన సినీ ప్రయాణం ప్రారంభమైంది. నడుచుకుంటూ కింగ్ నాగార్జున ఇంటికి వెళ్ళేవాడిని. పక్కనే ఉన్న శ్రీదేవి ఇంటిని చూస్తే అక్కడే నిల్చిపోయేవాడిని. శ్రీదేవిని దేవతగా భావించేవాడిని. ఓ దేవత ఇలాంటి ఇంట్లో ఉంటుందా అని అనుకునేవాడిని. "శివ" హిట్ అయ్యాక శ్రీదేవితో సినిమా చేయాలనుకున్నా. 'క్షణక్షణం' సినిమా కథ శ్రీదేవి కోసమే రాసుకున్నా. శ్రీదేవిని తొలిసారి చూసే అవకాశాన్ని ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి నాకు కల్పించారు. 
 
ఒక రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నా దేవత ఇంటికి వెళ్ళాం. సమయానికి కరెంట్ పోయింది. ముంబై వెళ్లేందుకు శ్రీదేవి అంతా సర్దుకుంటున్న వేళ.. ఆమె కోసం వేచి చూశాను. కాసేపయ్యాక దేవతలా వచ్చిన శ్రీదేవి నన్ను చూసి నవ్వింది. క్యాండిల్ లైటులో శ్రీదేవి దేవతలా కనిపించింది. ఆమెతో సినిమా చేస్తున్నప్పుడు ఆమెకున్న అంకితభావం చూసి షాక్ అయ్యాను. ప్రతి సన్నివేశాన్ని పండించింది. డ్యాన్స్ అదరగొట్టింది. టేకులు బాగున్నా మరో టేక్ తీసేవాడిని. ఆమె నటన, అందం, అంకితభావం చూసి ఎంతో మురిసిపోయేవాడిని. 
 
కానీ తండ్రి మరణం, తల్లికి తప్పుడు సర్జరీ జరిగినప్పటి నుంచి ఆమె జీవితం మారిపోయింది. తర్వాత ఆమె బతుకు గూడులోని పక్షిగా మారిపోయింది. కారణం ఆమె తల్లే. తండ్రి స్నేహితులు, బంధువులను నమ్మాడు. ఆయన మరణం తర్వాత అందరూ శ్రీదేవి తల్లిని మోసగించారు. ఆ తర్వాత శ్రీదేవి తల్లి వివాదాస్పద ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టింది. బోనీ కపూర్ ఆమె జీవితంలో ప్రవేశించేనాటికి.. శ్రీదేవి చేతిలో నయాపైసా కూడా లేదు. బోనీ కపూరే పీకల్లోతు అప్పుల్లో కూరుకునివున్నాడు. ఆమెను ఓదార్చేందుకు అతని వద్ద ఏమీ లేదు. ఆపై అమెరికాలో శ్రీదేవి తల్లికి ఆపరేషన్ జరగడం.. ఆ తర్వాత ఆమె మంచానపడి మరణించింది. 
 
తల్లి పోయిన తర్వాత శ్రీదేవి చెల్లెలు శ్రీలత పొరుగింటి వ్యక్తితో లేచిపోయి పెళ్లి చేసుకోవడం వంటివి జరిగిపోయాయి. ఆమె తల్లి మరణించాక శ్రీదేవి పేరిటే అన్నీ ఆస్తులున్నా.. అనారోగ్యం బారిన పడిన తర్వాత తన తల్లితో బలవంతంగా ఆస్తులు రాయించుకుందనీ శ్రీలత కేసులు పెట్టింది. అపుడు శ్రీదేవికి ఒక్క బోనీ కపూరే ప్రపంచంగా కనిపించాడు. కానీ బోనీకపూర్ తల్లి శ్రీదేవిని శత్రువుగా చూసింది. బోనీ కపూర్‌కి అంతకుముందు పెళ్లైనా.. కుటుంబంలో చిక్కులు తెచ్చేందుకు శ్రీదేవి వచ్చిందని.. ఓ స్టార్ హోటల్‌లో బోనీకపూర్ తల్లి అందరి ముందే శ్రీదేవి కడుపుపై బలంగా గుద్దింది. 
 
బోనీ కపూర్ కూడా అప్పుల్లో కూరుకుపోయాక.. శ్రీదేవికి మనశ్శాంతి కరువైంది. బయటికి కనిపించే శ్రీదేవి వేరు.. లోలోపల ఆందోళన, అశాంతి వంటివి ఆమెను వేధించేవి. సిగ్గు ఆమెకు ఎక్కువ. అభద్రత నడుమే బతికేది. ఆత్మవిశ్వాసం తక్కువ. ఆమె కెరీర్, పేరు, ఆమె సంపాదన ఆమె సంతోషంగా బతికేందుకు తోడ్పడలేదు. పేరును నిలబెట్టుకోవడం కోసం సర్జరీలు చేసుకున్నా ఫలితం శూన్యం.

తన పిల్లల గురించి ఆలోచన ఆమెకు ఎక్కువ. వారి కెరీర్ గురించి పదే పదే ఆలోచించేది, కానీ అన్నింటికీ మౌనమే సమాధానం అన్నట్లుండేది. అందుకే దుబాయ్‌లో పెళ్లికి వెళ్లి కృత్రిమ మెరుపులను ఆనందించలేక హోటల్‌లోనే గడిపేసింది. ఆందోళనతో ఒత్తిడికి గురైంది.. ఏది ఏమైనా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా.. అంటూ వర్మ తన అభిప్రాయాలను సొంత పుస్తకంలో రాసుకున్నాడు.