శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:50 IST)

అంతా రహస్యం.. శ్రీదేవి మృతి నుంచి విచారణ వరకు...

అందాల నటి శ్రీదేవి మరణం నుంచి ఈ కేసు విచారణవరకు అంతా రహస్యంగానే ఉంది. ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు వార్తలు వచ్చాయి.

అందాల నటి శ్రీదేవి మరణం నుంచి ఈ కేసు విచారణవరకు అంతా రహస్యంగానే ఉంది. ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె మృతదేహానికి నిర్వహించిన శవపరీక్షలో ఆమె ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్టు తేలింది. దీంతో శ్రీదేవి మృతి కేసులో ఏదో మిస్టరీ దాగివుందనే అనుమానం కలుగుతోంది. 
 
అదేసమయంలో శ్రీదేవి మృతి కేసు విచారణ కూడా అంతా రహస్యంగానే సాగుతోంది. దీనికి కారణం.. గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న అంశాలను అధికారులు, దౌత్యవేత్తలు, కనీసం మీడియా కూడా బయటకు వెల్లడించడానికి వీల్లేదు. దాంతో కేసుకు సంబంధించిన అంశాలేవీ బయటకు పొక్కడం లేదు. అదేసమయంలో జాతీయ మీడియా మాత్రం చిలవలు పలవల కథనాలు కూడా మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి.