Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వృద్ధులు, పెద్దవాళ్లు పనికిరానివాళ్లా? ఐతే ఇక్కడ చూడండి...

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (19:19 IST)

Widgets Magazine
Family

ఈ ఆధునిక ప్రపంచంలో ఉమ్మడి కుటుంబం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. ఉమ్మడి కుటుంబము అనగానే నానమ్మ, తాతయ్య, అమ్మ-నాన్న, పిన్ని-బాబాయి.. వీళ్లందరూ కలసిమెలసి జీవనం సాగించడం. నేటి సమాజం ఉమ్మడి కుటుంబాన్ని ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పూర్వకాలంలో అందరూ కలసి ఉండటం వల్ల ప్రేమ, సహనం, ఆప్యాయత, క్షమాగుణం ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. కానీ నేటి సమాజంలో ఇవన్నీ లోపించాయి. పెద్దల పట్ల గౌరవం లేకుండటం, చులకన భావం ఏర్పడుతున్నాయి.
 
పెద్దలు మనతో ఉండటం వల్ల, వారు చెప్పిన మాట వినడం వల్ల మనకు తెలియకుండానే సంరక్షణ ఉంటుంది. ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే లాభాలేమిటో ఈ చిట్టి కథలో చూద్దాం. ఒక ఊళ్లో కృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. కృష్ణను వాళ్ల బామ్మ తల్లిదండ్రులు లేని లోటు లేకుండా చాలా అల్లారుముద్దుగా అపురూపంగా పెంచింది. బామ్మకు కృష్ణ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా కృష్ణకు బామ్మ అంటే ప్రాణం. బామ్మ చాలా కష్టపడి కృష్ణను పెద్ద చదువులు చదివించింది.
 
కృష్ణకు ఉద్యోగం వచ్చిన తర్వాత లక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిపించింది. లక్ష్మికి భర్త అంటే అంతులేని ప్రేమ. ఆ ప్రేమ వల్ల బామ్మ కృష్ణపై చూపించే ప్రేమను, చనువును లక్ష్మి భరించలేకపోయింది. ఏ విషయంలోనైనా బామ్మ చెప్పే సలహాలు, సూచనలు లక్ష్మికి నచ్చేవి కావు. బామ్మ ఎంత మంచిగా చెప్పినా తన మీద అధికారం చూపిస్తుందని, పెత్తనం చెలాయిస్తుందని లక్ష్మి అనుకునేది. భర్త ఆఫీసు నుండి రాగానే... బామ్మ నన్ను అలా అంటుంది, ఇలా అంటుంది అని లక్ష్మి చెప్తూ ఉండేది. కాని కృష్ణ మాత్రం బామ్మ చాలా మంచిది. పెద్దవారు ఏది చెప్పినా మన మంచికే అని సర్ది చెప్పేవాడు. కాని లక్ష్మికి బామ్మపై కోపం తగ్గలేదు. కృష్ణకు బాబు పుట్టడం, కృష్ణ స్వంతగా ఇల్లు కొనడం అన్నీ జరిగిపోయాయి. బామ్మ చాలా సంతోషించింది.
 
బామ్మ తన పాత సామాన్లు రోకలి, రోలు, తిరగలి, లాంతరు తదితర వస్తువులను తన పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకువచ్చింది. కాని లక్ష్మి అవన్నీ ఇంట్లో పెట్టడానికి ఒప్పుకోకుండా వాటిని స్టోర్ గదిలో పెట్టమని చెప్పింది. ఒకసారి కృష్ణ క్యాంపుకు వేరే ఊరు వెళ్లాడు. ఇదే అదనుగా లక్ష్మి ప్రతి చిన్న విషయానికి బామ్మను సాధించడం మొదలుపెట్టింది. చీటికిమాటికీ తిడుతూ ఉండేది. చివరకు బామ్మను ఇంట్లో ఉండనీయకుండా స్టోర్ గదిలో ఉండేలా చేసింది. ఒకరోజు రాత్రి విపరీతమైన గాలి, ఉరుములతో కూడిన వర్షం పడుతుంటే లక్ష్మి కిటికీలు వేస్తుంటే చేతి వేలు నలిగి రక్తం కారుతోంది. మరోవైపు బాబుకు తీవ్రంగా జ్వరం పట్టుకుంది. కరెంటు కూడా పోయింది. భర్త కృష్ణ కూడా ఇంట్లో లేకపోవడంతో లక్ష్మికి ఏం చేయాలో అర్ధంగాక బామ్మ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టింది. 
 
లక్ష్మి పిలుపుతో సంతోషంగా బయటకు వచ్చిన బామ్మ, లక్ష్మి చేతి వేలికి గాయాన్ని చూసి విలవిలలాడిపోయింది. వేలుకి పసుపు వేసి కట్టు కట్టింది. ఇంతలో బిడ్డకు జ్వరంగా వుందని చెప్పడంతో వెంటనే బామ్మ రోట్లో శొంఠి, మిరియాల పొడి వేసి కషాయం తయారు చేసి బాబుకి తాగించింది. బామ్మను లక్ష్మి ఎంతో బాధ పెట్టినా తన మీద ఎంతో ప్రేమ ఉందని తెలుసుకున్న లక్ష్మి అప్పటి నుండి బామ్మను చాలా ప్రేమగా చుసుకోవడం మొదలుపెట్టింది. క్యాంపు నుండి తిరిగివచ్చిన కృష్ణ తన భార్య, బామ్మ మీద చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషపడ్డాడు. కాబట్టి పెద్దవారే కదా అని వారిని దూరం పెట్టడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. వారంతా క్షేమం కోరే వారని తెలుసుకోవాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీతో ఇంకా అంటకాగితే చిత్తుగా ఓడిస్తారు : చంద్రబాబుతో నేతలు

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే ...

news

కేంద్ర బడ్జెట్ పైన నారా బ్రహ్మిణి పొగడ్తలు... తెదేపా నేతలు షాక్...

కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ...

news

తొందరపడొద్దు... అదును చూసి దెబ్బకొడదాం : నేతలతో చంద్రబాబు

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ...

news

'నా కోరిక తీర్చితే మీకు పీహెచ్‌డీలు ఇప్పిస్తా' : జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వేధింపులు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ బుద్ధి వక్రమార్గంలో పయనించింది. ఫలితంగా తన వద్ద ...

Widgets Magazine