శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (14:24 IST)

రోజ్ వాటర్‌ను రోజూ వాడితే.. మేలెంతో తెలుసా?

ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి వలయాక

ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మర్దన చేయడం ద్వారా చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. 
 
రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. జాస్మిన్ ఆయిల్‌లో కొద్దిగా రోజ్ వాటర్‌ను మిక్స్ చేసి శరీరానికి రాస్తే శరీరం నుంచి వెలువడే దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
 
తాజా కీరదోసను రసంగా చేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని పచ్చి పాలు కలిపి ఫ్రిజ్‌లో 15 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం దాంట్లో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది. ఇది సహజమైన టోనర్‌లా పనిచేస్తుందని బ్యూటీషియన్లు అంటున్నారు.