తమలపాకును నమిలితే ఆ సామర్థ్యం రెట్టింపు అవుతుందట..

బుధవారం, 17 జనవరి 2018 (15:41 IST)

తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయి. తమలపాకులను రోజుకొకటి నమిలితే.. గ్యాస్, అసిడిటీ దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. తద్వారా మధుమేహం అదుపులో వుంటుంది. తమలపాకులను కొద్దిగా తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గిపోతుంది. చర్మ సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
 
అలాగే తమలపాకుల్ని రోజూ నమిలితే లైంగిక పటుత్వం పెరుగుతుంది. శృంగార సామ‌ర్థ్యం రెట్టింపు అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి తమలపాకులు బాగా పనిచేస్తాయి. వీటిని తగిన మోతాదులో తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. 
 
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసం తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.  మాటలో స్పష్టత వస్తుంది. కఫం తొలగిపోతుంది. జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మధుమేహ వ్యాధిగ్రస్థులు స్కిన్‌తో పాటు చికెన్ తీసుకోకండి..

మధుమేహ వ్యాధిగ్రస్థులు సాచురేటేడ్ ఫాట్ పదార్ధాలని కలిగి ఉండే మాంసం, చికెన్ స్కిన్, మీగడ ...

news

అవిసె గింజలతో మహిళల్లో ఆ సమస్య వుండదట..

అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్‌ ...

news

నిమ్మరసం తాగితే ఎంత మేలో తెలుసా?

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని ...

news

దాల్చిన చెక్క పొడితో ఇంత మేలా?

బరువు తగ్గాలనుకుంటే ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించేందుకు అరగంట ముందు దాల్చిన చెక్క పొడి, ...

Widgets Magazine