శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:10 IST)

నాగ చైతన్య, సాయి పల్లవి ల తండేల్ కీలక షెడ్యూల్ పూర్తి

Sai Pallavi,  chandu mondeti
Sai Pallavi, chandu mondeti
నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న తండేల్ కీలక షెడ్యూల్ పూర్తి అయింది. డైరెక్టర్ చందూ మొండేటి గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ కీలక లెంతీ షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకకరీంచారు.

ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజ సిద్ధంగా కనిపించారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సుందరమైన, సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.  
 
ఇప్పటికే విడుదలైన 'తండేల్' ప్రమోషనల్ కంటెంట్ సంచలనం సృష్టించింది. ఎసెన్స్ అఫ్ 'తండేల్' గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ట్రెండై సినిమాపై అంచనాలని మ్యాసీవ్ గా పెంచింది. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ చేయనుంది. యదార్థ సంఘటనల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఇందులో తన పాత్ర కోసం కంప్లీట్ గా మేక్ఓవర్ అయ్యారు.