మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (19:01 IST)

చైతూ కొత్త చిత్రం.. వెంకట్ ప్రభుతో పక్కా కమర్షియల్ మూవీ

nagachaitanya
nagachaitanya
టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య తాను నటించిన 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలు హిట్‌ కొట్టడంతో ఫుల్‌ జోష్‌మీద ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. నాగచైతన్య తొలి తమిళ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా ఈ సినిమాకు పేరు ఖరారు కాలేదు.  
nagachaitanya
nagachaitanya
 
ఈ సినిమా గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. నాగ చైతన్యకున్న ఫ్యాన్స్ గురించి బాగా తెలుసు. అందుకే   ఓ విజయ వంత మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాను. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటులు మాత్రమే కాకుండా,  ప్రముఖ సాంకేతిక నిపుణులను కూడా సంతకం చేశారు" అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 
Chay
Chay
 
తారాగణం : నాగ చైతన్య
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్
సమర్పణ: పవన్ కుమార్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్టా.