శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (12:48 IST)

''లవ్ స్టోరీ''లో ఆ అంశాన్ని టచ్ చేస్తారట.. క్లైమాక్సే హైలైటా?

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపుదిద్దుకుంటున్న ''లవ్ స్టోరీ''లో సామాజిక అంశాన్ని శేఖర్ కమ్ముల టచ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో కుల సమస్యలను ఈ చిత్రంలో చర్చిస్తున్నట్టు సమాచారం. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారీగా చైతూ, సాయి పల్లవి నటిస్తున్నారు. 
 
ఏషియన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. వరుణ్ తేజ్ - సాయి పల్లవి తో తీసిన ‘ఫిదా’ తో అందర్నీ మరోసారి ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కిస్తున్నాడు.  
 
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ , టీజర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అవుతోంది. అదే ఈ సినిమాలోని క్లైమాక్స్. సాడ్ ఎండింగ్‌తో హృదయాలను పిండేసే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను శేఖర్ కమ్ముల ఈ సినిమాలో రాసుకున్నారని తాజా సమాచారం. 
 
నాగచైతన్య పోషించిన హీరో పాత్ర చనిపోగా.. అతని జ్ఞాపకాలతో సాయి పల్లవి పోషించిన పాత్ర జీవితాన్ని కొనసాగిస్తుందట. ప్రేక్షకులతో కంటతడి పెట్టించే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. తెలంగాణ పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్‌లో మంచి కెరీర్ కోసం చూసే ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల.  
 
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారట. ఇక ఈ సినిమాని నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి ఛైర్మన్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.