శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 12 మార్చి 2020 (22:18 IST)

చైతు ఏయ్ పిల్లా సాంగ్ నిజంగా బాగుందా..?

యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత సహజంగా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాలోని పాత్రలు ఆ పాత్రల స్వభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుంటాయి. ఆ విధంగా శేఖర్ కమ్ముల తన చిత్రాల్లోని పాత్రలను డిజైన్ చేస్తుంటారు.
 
ఆనంద్ సినిమాలోని రూప పాత్ర అయినా.. ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర అయినా సరే... ప్రేక్షకులకు అంతలా గుర్తుంది అంటే దానికి కారణం.. ఆయా పాత్రలను శేఖర్ కమ్ముల ఎంతో ప్రేమించి డిజైన్ చేయడమే. అందుకనే శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. శేఖర్ కమ్ముల తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలోని ఏయ్ పిల్లా అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. 
 
ఇందులో ఏ పిల్లా.. పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామో అంటూ సాగిన ఈ పాటను హరిచరణ్ ఆలపించగా.. చైతన్య పింగళి లిరిక్స్ అందించారు. పవన్ హెచ్ స్వరాలను సమకూర్చారు.
 
 ఇది ప్యూర్ లవ్ సాంగ్.. సూపర్‌గా ఉంది అంటూ నెటిజన్లు నుంచి మంచి స్పందన లభిస్తుంది. బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది. సినిమా కూడా బ్లాక్‌బస్టర్ ఖాయం. చైతు - సాయి పల్లవి మ్యాజిక్ చేసేసారు... ఇలా ఈ సాంగ్‌కు కామెంట్స్ వస్తున్నాయి. 
 
మరికొంత మంది అయితే.. సాంగ్ స్లోగా ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ సాంగ్ మాత్రం ఫ్యూర్ లవ్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
 
 మిగిలిన ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేయడంతో ఓ వైపు షూటింగ్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 29న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.