Widgets Magazine

నాగార్జున‌కి కోపం వ‌చ్చింది. ఏం చేసాడో తెలుసా?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:47 IST)

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఏదీ మ‌న‌సులో దాచుకోలేడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పేస్తుంటాడు. విష‌యం ఏంటంటే.. నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ‌వంశీ నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన శైల‌జారెడ్డి అల్లుడు ఆడియోకు మంచి స్పంద‌న ల‌భించింది. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో చైతుకి అత్త‌గా న‌టించ‌డంతో మ‌రింత క్రేజ్ వ‌చ్చింది ఈ మూవీకి. 
Nagarjuna
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. శైల‌జారెడ్డి అల్లుడు ప్రి-రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ కోట్ల విజ‌య‌భాస్క‌రరెడ్డి ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కి నాగార్జున‌, నాని ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. అయితే... అక్క‌డ కొంతమంది అభిమానులు శైల‌జారెడ్డి అల్లుడు.. శైల‌జారెడ్డి అల్లుడు అంటూ అరిచారు. ఇది నాగార్జున‌కు న‌చ్చ‌లేదు. అంతే... ఆ విష‌యాన్ని స్టేజ్ పైనే చెప్పేసాడు. 
 
నాగార్జున మాట్లాడుతూ... చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున పెద్ద కొడుకు అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను ఏమాత్రం మొహ‌మాటం లేకుండా చెప్పేసాడు. ద‌టీజ్ నాగార్జున‌.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా భార్య గర్భస్రావానికి అతనే కారణం.. హిందీ నటుడు

బాలీవుడ్ నటుడు సుమీత్ సచ్‌దేవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య గర్భవిచ్ఛిత్తికి ఆమె బాస్ ...

news

సల్మాన్ సరసన నటించేందుకు ప్రియాంక వెయ్యిసార్లు ఫోన్ చేసిందట..?

''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ...

news

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం

దివికేగిన అతిలోక సుందరికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలుగు ప్రేక్షకులనే కాకుండా భారతీయ సినీ ...

news

నా భార్య చాలా హ్యాపీ.. వదంతులు నమ్మొద్దు : సొనాలీ బింద్రే భర్త

కేన్సర్‌తో బాధపడుతున్న తన భార్య సొనాలీ బింద్రే చాలా సంతోషంగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్ ...

Widgets Magazine