Widgets Magazine

దేవ‌దాస్‌కి సెంటిమెంట్ క‌లిసొచ్చేనా..?

శుక్రవారం, 13 జులై 2018 (21:52 IST)

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ చిత్రానికి శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే.. సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ట‌. 
nagarjuna in devadas
 
ఇంత‌కీ ఆ కార‌ణం ఏంటంటే... దాదాపు 24 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా నటించిన శుభలగ్నం సెప్టెంబర్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే దాదాపు పదిహేడేళ్ల క్రితం ఎన్టీఆర్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అశ్వనీదత్‌ ఒక నిర్మాతగా తెరకెక్కిన స్టూడెంట్‌ నెం.1 చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదలై, ఘ‌న విజ‌యం సాధించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన రామ్‌చరణ్ తొలి చిత్రం చిరుత కూడా సెప్టెంబర్‌ 28న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 
 
ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 27న భారీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌ రిలీజ్ చేస్తున్నార‌ట‌. మ‌రి.. ఈసారి కూడా ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆశిద్దాం.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను ప్రధానిని ప్రేమిస్తున్నా - మాధవీలత

చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు సినీ పరిశ్రమలో మాధవీలతకు ప్రత్యేకత ఉంది. ఈమధ్య ...

news

వైఫ్ ఆఫ్ రామ్‌కి జ్యోతిక స‌పోర్ట్..!

విల‌క్ష‌ణ న‌టి మంచు లక్ష్మి నటించిన తాజా సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. రాజ‌మౌళి శిష్యుడు విజయ్ ...

news

నా ఛాతీ లోపల చేయి పెడతావా? 'బిగ్ బాస్' ఇంట్లో భానుశ్రీ రచ్చరచ్చ

మంచివారు-చెడ్డవారు టాస్క్ టాపు లేపింది. రచ్చ రచ్చ కూడా అయింది. ఈ టాస్కులో భానుశ్రీ ఒక ...

news

నాకు ఆ సినిమాలంటే ఇష్టం.. ఉపాసన వల్లే ఆ సినిమాలు?: చెర్రీ

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనకు బయోపిక్‌లపై గల ఇష్టాన్ని వెల్లడించాడు. తనకు బయోపిక్‌లంటే ...

Widgets Magazine