శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (18:16 IST)

ఇటలీకి వెళుతున్న నందిని రెడ్డి, స్వప్న టీం, ఎందుకంటే !

Nandini Reddy and Swapna
Nandini Reddy and Swapna
నందిని రెడ్డి, స్వప్న సినిమా అద్భుతమైన కాంబినేషన్. అందరినీ నచ్చే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ది చెందిన ప్రొడక్షన్ హౌస్, అలాగే నందిని రెడ్డి ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్. కథనంలో తాజాదనాన్ని తీసుకురావడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉన్నారు.  తారాగణం సినిమాకు గొప్ప విలువను జోడించింది.
 
‘ఏప్రిల్ 20న మీట్  రిషి & ఆర్య ఇన్ ఇటలీ’ అని ఒక ప్లజంట్  వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్  ప్రమోషనల్ స్టఫ్ . గ్లింప్స్ లో విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన  లవ్లీ  రిలేషన్ షిప్ ని ప్రజంట్ చేస్తోంది. వారి ప్రయాణం ఆసక్తికరంగా వుంది. వీడియోలోని చివరి భాగం కంప్లీట్ హ్యూమరస్ గా వుంది.
 
నందినీ రెడ్డి ఆర్య, రిషి పాత్రలను అద్భుతంగా ప్రజంట్ చేశారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తమ పాత్రలను ఆకట్టుకునేలా చేశార్. మిక్కీ జె మేయర్ సంగీతం బిగ్  ప్లస్. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.