టాలీవుడ్‌ను వెంటాడుతున్న ప్రమాదాలు... ఆ యువనటుడికి గాయాలు.. రెస్ట్‌లో..

nani
జె| Last Modified గురువారం, 13 జూన్ 2019 (18:46 IST)
తెలుగు సినిమాను ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఒకరి తరువాత ఇంకొకరు ప్రమాదాల బారిన పడుతూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ కోలుకొని సెట్స్ పైకి వచ్చాడనుకుంటే మరో యంగ్ హీరో ప్రమాదానికి గురయ్యాడు. అదెలా జరిగింది. ఇంతకీ ఎవరా హీరో..

జెర్సీ తరువాత నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్సకత్వంతో మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా నాని ప్రమాదానికి గురయ్యాడు. కాలికి.. చేతికి దెబ్బలు తగిలాయి. దెబ్బ పెద్దది కాకపోయినా వారంరోజుల పాటు మాత్రం రెస్ట్ ఉండాలని వైద్యులు సూచించారు.

గ్యాంగ్ లీడర్‌ను ఆగష్టు 30వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు నిర్మాతలు. నాని మరో 20 రోజులు సెట్స్ మీదకు రానని చెప్పడంతో రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారట. అక్టోబర్ 2వ తేదీన సైరా మూవీ రిలీజ్‌కు సన్నాహాలు చేయడంతో గ్యాంగ్ లీడర్‌ను సెప్టెంబరులో రిలీజ్ చేసే అవకాశముంది.

హీరోలు గాయాలబాట పట్టడం రాంచరణ్‌తో మొదలైంది. వర్కవుట్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్‌కు గాయమైంది. ఇది జరిగి మూడు నెలలవుతున్నా చెర్రీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. నెలాఖరులో ఆర్.ఆర్.ఆర్. సినిమాలో జాయిన్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. రాంచరణ్ తరువాత ఎన్టీఆర్, ఇప్పటికి ఎన్టీఆర్‌కు గాయమై సెట్స్ మీదకు వచ్చాడు. కానీ వెంటనే నానికి దెబ్బతగలడంతో తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరోలకు వరుసగా దెబ్బలు తగులుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.దీనిపై మరింత చదవండి :