సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (19:18 IST)

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ సిద్ధమైంది

Naveen Polishetty, Anushka
Naveen Polishetty, Anushka
నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించారు.
 
అనౌన్స్ మెంట్ నుంచి అందరిలో ఆసక్తి కలిగించింది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.