శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (16:57 IST)

శ్రీరెడ్డీ... ఆ ఫేక్ ఫోటోను పీకేస్తావా లేదా? రజినీ ఫోటోపై నెటిజన్లు ఫైర్

శ్రీరెడ్డి వ్యవహారం ఓ ఫార్సులా మారుతోందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తుందేమోననే కామెంట్లు వినబడుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ సబ్జెక్టు నుంచి టోటల్‌గా పక్కకపోయిన తన సబ్జెక్ట్ నేరుగా పవన్ కళ్యాణ్ పైకి మళ్లిన

శ్రీరెడ్డి వ్యవహారం ఓ ఫార్సులా మారుతోందా అంటే అవుననే అనుకోవాల్సి వస్తుందేమోననే కామెంట్లు వినబడుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ సబ్జెక్టు నుంచి టోటల్‌గా పక్కకపోయిన తన సబ్జెక్ట్ నేరుగా పవన్ కళ్యాణ్ పైకి మళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే శ్రీరెడ్డి పోస్ట్ చేసిన రజినీకాంత్ ఫోటోపై ఇప్పుడు నెటిజన్లు కొందరు ఫైర్ అవుతున్నారు. 
 
రజినీకాంత్ చెప్పని మాటలకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేస్తూ... రజినీకాంత్ సర్ చాలా గ్రేట్ అనీ, ఆయనలా తెలుగు హీరోలు లేరంటూ విమర్శించింది. ఆమె విమర్శలపై ఇప్పుడు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ఫోటోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు రజినీకాంత్ అలాంటి మాటలు చెప్పలేదనీ, ఒకవేళ అంత దానగుణం వుంటే నీ ఆస్తి మొత్తం పేదలకు రాసేసి మీ సొంత వూరు వెళ్లి తల్లీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.