Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిక్కింపై చిల్లరగా కామెంట్స్ చేసిన ప్రియాంకా.. కడిగిపారేస్తున్న నెటిజన్లు

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:01 IST)

Widgets Magazine
priyanka

దేశంలో ఉన్న అతి చిన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న సిక్కింపై బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నోరు జారారు. ఆమె చేసిన చిల్లర వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా ఆమె మాట్లాడుతూ, సిక్కం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కొని ఈ సినిమా తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలి సినిమా ‘పహునా’నే అంటూ’ ప్రియాంక చెప్పుకొచ్చింది. 
 
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు. 
 
కాగా, ప్రియాంక చోప్రా నిర్మాతగా 'మారి పహునా' అనే మూవీ నిర్మించింది. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటుచేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు. ‘పహునా’ను టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా ఆమె సిక్కిం రాష్ట్రం గురించి చిల్లరగా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాగా చూపించాను... ప్లీజ్ తీసేయండి... మాజీ మిస్ యూనివర్శ్ 'హేట్ స్టోరీ 4' సీన్స్

మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతెలా ఇప్పుడు హేట్ స్టోరీ 4 చిత్రం గురించి చాలా భయపడుతోందట. ...

news

శ్రీవల్లీ రివ్యూ రిపోర్ట్: విజయేంద్రప్రసాద్.. రచయితగా సక్సెస్.. కానీ దర్శకుడిగా..?

మగధీర, బాహుబలి వంటి హిట్ సినిమాలకు కథలు రాసిన జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ...

news

'మాస్ మహరాజ్‌'తో ఆడిపాడనున్న రాశీఖన్నా

టాలీవుడ్ అందాల భామల్లో ఒకరైన రాశీఖన్నా కూడా స్పెషల్ సాంగ్‌లో చిందేయడానికి సిద్ధమైంది. ...

news

జై లవకుశలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఆ టైంలో పీక్స్(వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ...

Widgets Magazine