గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (14:15 IST)

చేతిలో పూలకుండీ.. స్మార్ట్ లుక్‌లో సిమ్రాన్, రజనీ కాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ జంటగా నటిస్తున్న ''పేట్ట'' సినిమా లుక్ విడుదలైంది. ఈ లుక్ చూసి రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్ లుక్ అదిరింది. రజనీకి జోడీగా సిమ్రాన్ కనిపించనుంది. చేతిలో పూలకుండీలతో స్మార్ట్ లుక్‌లో సిమ్రాన్, రజనీ కాంత్ అదిరిపోయారు. 
 
అలాగే ఇదే సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని సినీ యూనిట్ తాజా పోస్టర్ ద్వారానే చెప్పేసింది. మరోవైపు అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'విశ్వాసం' కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. అజిత్ సరసన కథానాయికగా నయనతార నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.