మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:21 IST)

ఆపరేషన్ చేయించుకున్నది నిజమే.. నికీషా పటేల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "కొమరం పులి". ఈ చిత్రంలో నికీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె కోలీవుడ్ బాటపట్టింది. ఇక్కడ ఐదారు చిత్రాల్లో ఈ గుజరాతీ ముద్దుగుమ్మ నటించి, ప్రేక్షకులను ఆలరించింది. ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ సరసన, ఎళిల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ముంబై ఆస్పత్రిలో రహస్యంగా నికీషా పటేల్‌ ఆపరేషన్‌ జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆమె ట్విట్టర్‌లో స్పందించారు. అవును తనకు చిన్న ఆపరేషన్‌ జరిగిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఎలిల్‌ సినిమాలో తన షూటింగ్‌ పూర్తయ్యిందని, కొత్త ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.